మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మహిళా సాధికారికత, సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం ‘మా’లో ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్’ (డబ్ల్యు.ఇ.జి.సి.)ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీత కృష్ణన్ గౌరవ సలహాదారుగా ఉంటారని విష్ణు చెప్పారు. నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పురుషులతో ఈ కమిటీని వేయబోతున్నామని, అందులోని సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని విష్ణు అన్నారు. మరింత మంది మహిళలు ‘మా’ లో సభ్యులు కావాలన్నది తమ ఆకాంక్ష అని అందులో భాగంగానే మహిళ సంరక్షణతో పాటు వారికి మరింత అధికారాన్ని అందించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని విష్ణు తెలిపారు.