Sunil : యాక్టర్ గా సునీల్ ఇప్పుడు ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మళ్లీ కమెడియన్ గా కూడా సినిమాలు చేయడంతో కెరీర్ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో విలన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన మెయిన్ లీడ్ రోల్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ఏ హీరో బాగా సపోర్టు చేస్తారు ఇండస్ట్రీలో అని అడిగిన ప్రశ్నకు సునీల్ ఆన్సర్ ఇచ్చిన విధానం ఆకట్టుకుంటోంది.
Read Also : Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో!
‘టాలీవుడ్ లో చిరంజీవి తర్వాత పిలిస్తే వచ్చి సపోర్టు చేసే వ్యక్తి నాని. నాని తను ఎంత బిజీగా ఉన్నా సరే ఒక సినిమా ఫంక్షన్ కు పిలవగానే కచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. తన షూటింగ్ ఏ రోజు ఉంది.. ఏ టైమ్ దాకా షూటింగ్ లో ఉండి ఫంక్షన్ కు వస్తాడు అనేది పూర్తిగా చెప్తాడు. ఒక స్టార్ హీరోకు అంత క్లియర్ గా అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది నాని బాధ్యతగా భావిస్తాడు. అతను కచ్చితంగా ఏదో ఒక రోజు స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడు’ అంటూ సునీల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.