Sundaram Master: మాస్ మహారాజా రవితేజ.. ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను నిర్మించి.. తన సినిమాలకే కాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ నుంచి మట్టి కుస్తీ, ఛాంగురే బంగారు రాజా వంటి సినిమాలు వచ్చాయి. ఇవి రెండు ఆశించిన ఫలితాలు అందివ్వలేనప్పటికీ.. కొత్త కథలను ఎంచుకున్న తీరు బావుంది అనే ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఈ బ్యానర్ లో వస్తున్న మూడో చిత్రం సుందరం మాస్టర్. వైవా హర్ష మరియు దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథ ఇది.. తను ఒక గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ ను బోధిస్తుంటాడు. అయితే మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందులో అన్ని వయస్సులవారు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి విద్యార్థులుగా అయితే వస్తారు. మరి సుందరం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించాడు అనేది సినిమా కథ అని తెలుస్తుంది. కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 16 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుందని తెలుపూతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో సుందరం మాస్టర్.. గ్రామస్థుల అటెండెన్స్ తీసుకుంటున్నట్లు చూపించారు. మరి ఈ సినిమాతో వైవా హర్ష హీరోగా, రవితేజ నిర్మాతగా గా సక్సెస్ అందుకుంటారా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.