Sundar C : మరో సినిమాను రిలీజ్ చేస్తున్న సుందర్. సి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హార్రర్- మసాలా తీసి హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు పీహెచ్‌డీ చేశాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడటంతో పాటు క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీలతో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే కామెడీని పండించడంలో కూడా దిట్టే. నటనలోనూ ప్రావీణ్యం సాధించాడు. రీసెంట్లీ బాక్సాఫీస్ టార్గెట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్న హీరో కమ్ డైరెక్టర్ సుందర్ సి. 90ల్లోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ కొట్టి నటనపై ఇంట్రస్టుతో హీరోగా మేకోవర్ అయ్యాడు. మెగా ఫోన్ పడుతూ గ్యాప్‌లో యాక్టింగ్ చేస్తున్నాడు. దర్శకుడిగా 12 ఏళ్ల క్రితం పూర్తి చేసిన మదగజరాజాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేసి ఊహించని హిట్ అందుకున్న సుందర్ ఇదే జనవరికి తాను హీరోగా నటించిన సినిమాను పట్టుకొస్తున్నాడు.
Also Read : Mrunal Thakur : టాలీవుడ్ కు టాటా చెప్పేస్తున్న టాల్ బ్యూటీ
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
సుందర్ సి అనగానే చాలా మందికి హారర్ మూవీసే గుర్తుకు వస్తాయి. అరణ్మనై ఫ్రాంచేజీ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిన ఈ పిల్మ్ మేకర్ క్రైమ్ అండ్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీలను తీయడంలో దిట్ట. ఓ వైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరో వైపు వీలు చిక్కినప్పుడల్లా కెమెరా ముందుకు వస్తుంటాడు. రీసెంట్లీ హీరోగా నటించిన వల్లన్ సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు. జనవరి 24న మిస్టరీ థ్రిల్లర్ మూవీని దించేస్తున్నాడు.
2022 నుండి షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టి ఈ నెలలోనే థియేటర్లలోకి రాబోతుంది. కట్టప్పవ కనోమ్ ఫేం మణి సేయన్ వల్లన్‌కు దర్శకుడు. తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ కామరాజ్, హెబ్బా పటేల్ కీ రోల్స్ చేస్తున్నారు. మరీ దర్శకుడిగా హిట్ చూసిన సుందర్ సి హీరోగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూద్దాం.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!