OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. తమ అభిమాన హీరో నుంచి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ‘OG’ సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూపించిన దర్శకుడు సుజీత్‌తో మరోసారి పవర్‌స్టార్ జత కట్టినప్పటినుంచి ‘OG 2’పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పవన్ బర్త్‌డే వచ్చేసినా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పెద్ద అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. కానీ ఇప్పుడు దర్శకుడు సుజీత్ చేసిన పోస్ట్ తో అభిమానులకు ఊరట లభించేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు సుజీత్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. పవర్‌స్టార్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, అదే పోస్ట్ చివర్లో సాయంత్రం 4:05 గంటలకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ‘OG 2’కు సంబంధించినదేనా, లేక OG యూనివర్స్‌లోని మరో అంశానికి సంబంధించినదా అనే చర్చ మొదలైంది.
వాస్తవానికి ‘OG 2’ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ గతంలో పవన్ కళ్యాణ్, సుజీత్ కలయికలో OG యూనివర్స్‌ను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీంతో తొలి భాగంతో పరిచయమైన గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని రెండో భాగంలో మరింత పెద్ద స్థాయిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా గతంలో ‘OG 2’కు సంబంధించి బర్త్‌డే సందర్భంగా ఏదో ఒక సర్ప్రైజ్ ఉండొచ్చనే విధంగా హింట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు సుజీత్ ఒక పవర్ఫుల్ యానిమేటెడ్ వీడియోను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా ఫిలింనగర్ వర్గాల్లో జరిగింది. దీంతో ఇప్పుడు దర్శకుడు చెప్పిన 4:05 సర్ప్రైజ్ గ్లింప్స్ అవుతుందా, యానిమేటెడ్ వీడియోనా, ఫస్ట్ లుక్ పోస్టరా లేక చిన్న ప్రమోషనల్ కంటెంట్ మాత్రమేనా అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
అలాగే ‘OG 2’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. బర్త్‌డే సందర్భంగా పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ విడుదల చేసినా వెంటనే షూటింగ్ మొదలవుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రొడక్షన్ ప్లాన్, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండే తేదీలు వంటి అంశాలపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు పవన్ అభిమానుల దృష్టి మొత్తం సాయంత్రం 4:05 గంటలపైనే ఉంది. సుజీత్ చెప్పిన ఆ చిన్న సర్ప్రైజ్ నిజంగా ‘OG 2’ గ్లింప్సా, పవన్ కళ్యాణ్ కొత్త లుక్కా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal…
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️… pic.twitter.com/RoeZcylAYv
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..