టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని, మణిరత్నం ల లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. డైరెక్టర్ మణిరత్నం.. సుహాసిని చూడడం, ఆమెకు ప్రేమను వ్యక్తం చేయడం, ఇద్దరు పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే తమది అంత పెద్ద లవ్ స్టోరీ కాదని, నిజం చెప్పాలంటే తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన విశేషాలను పంచుకుంది. ” నేను హీరోయిన్ అయ్యి.. కొద్దిగా ఫేమస్ అయ్యాకా మణిరత్నం గారు నా వద్దకు ఒక కథ చెప్పడానికి వచ్చారు.
కథ చెప్పాకా అది నచ్చకపోవడంతో నేను వెంటనే నో చెప్పాను. అందుకు ఆయన కూడా ఫీల్ అవ్వకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత మేం కలవలేదు. అయితే మణిరత్నంగారి అన్నయ్య, మా నాన్నగారు మంచి స్నేహితులు. ఆ కారణంగానే మణిరత్నంగారికి, నాకు పెళ్లి చేయాలనీ పెద్దలు నిశ్చయించారు. ఆ విషయం నాకు చెప్పి, ఒక్కసారి మణిరత్నం గారిని కలిసి మాట్లాడమని చెప్పారు. దీంతో ఆయనను కలిసి కొద్దిసేపు మాట్లాడాను. ఆ కొద్దీ సమయంలోనే మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే అని అర్థమైంది. దీంతో వెంటనే మా పెళ్లి జరిగిపోయింది. ఇదే మా పెళ్లి స్టోరీ. పెళ్లి తరువాత ఆయన నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు, నటనలో కొనసాగుతూ దర్శకురాలిగా ఇలా ఉన్నాను అంటే దానికి ఆయన సపోర్ట్ చాలా ఉంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుహాసిని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.