Suhas: సుహాస్.. శ్రీరంగ నీతులు చెప్పేది ఎప్పుడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhas: సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇక ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ మాట్లాడుతూ.. ” యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. మా సినిమా ఈ కోవలోనే చేరుతుంది. ఇటీవల విడుదలైన మా టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది, అజయ్ అరసాడ, హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం మా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా వుంటుంది.యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఇక నిర్మాత వెంకటేశ్వరరావు బల్మూరి మాట్లాడుతూ “నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. మరి ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!