Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!

Sottapuli

Sottapuli

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వర్సటైల్ యాక్టింగ్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ సరికొత్త ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్న మోస్ట్ అవేటెడ్ కోలీవుడ్-టాలీవుడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘మండాడి’. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ **సూరి**, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ‘ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్’ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి హీరో సుహాస్ క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సుహాస్ మేకోవర్, రస్టిక్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

సముద్ర తీరప్రాంతం, మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ సినిమాను దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రియల్ లొకేషన్స్‌లో ఎంతో నేచురల్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ఇద్దరూ మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో.. సుహాస్ చేతిలో కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనేలా ఉంది. ఈ చిత్రంలో సుహాస్ ‘సాట్టపులి’ అనే ఒక పవర్‌ఫుల్ అండ్ నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్‌లో మెప్పించబోతున్నారు.

ఈ సినిమాలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే బోట్ యాక్షన్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ ఫైట్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ యాక్షన్ సీన్స్‌ను స్టార్ ఫైట్ మాస్టర్స్ పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుహాస్ సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.