Site icon NTV Telugu

Suhana Khan: అతడితో కారులో అడ్డంగా దొరికిన స్టార్ డాటర్

suhana khan

suhana khan

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. త్వరలోనే అమ్మడు హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వనుందని వార్తలు ఇప్పటికే గుప్పుమంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో సుహానా హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును పిచ్చెక్కిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసింది.

ఇటీవల ఒక అబ్బాయితో కారులో వెళ్తూ కెమెరా కంటికి చిక్కింది. ఇక మీడియా ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా ఇద్దరు ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని కనిపించారు. అంతగా మీడియా కంటపడకుండా తప్పించుకోవడం ఎందుకు..? సుహానా పక్కన ఉన్న సీక్రెట్ ఫ్రెండ్ ఎవరు..? అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడా..? అందుకే భయపడుతున్నారా..? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కూతురు పక్కన ఉన్న ఫ్రెండ్ గురించి షారుఖ్ ఏమంటాడో తెలియాల్సి ఉంది.

Exit mobile version