సాయి రాజేష్ బేబీ, నాని నటించిన హాయ్ నాన్న, పాయల్ మంగళవారం, తరుణ్ భాస్కర్ కీడాకోలా, సితార ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మూవీ, శ్రీ విష్ణు సామజవరగమన, ధనుష్ సార్, సుహాస్ పద్మభూషణ్… ఈ సినిమాల్లాంటిలో ఉన్న కామన్ పాయింట్ రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ వేయడమే. అసలు అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాల ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ ని ఈ సినిమాలు ఎక్కువ రాబట్టడానికి ప్రీమియర్స్ ప్రధాన కారణం అయ్యాయి. ఐటివలె రిలీజై 250 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ కూడా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోని, బాక్సాఫీస్ ని షేక్ చేసిందే. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవ్వడానికి రెడీ అవుతుంది “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”.
గీతా ఆర్ట్స్ 2 నుంచి సుహాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి రానుంది. ట్రైలర్ తో మంచి బజ్ జనరేట్ చేసిన ఈ మూవీని ఫిబ్రవరి 2 కన్నా ముందు ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేస్తే… వచ్చే పాజిటివ్ టాక్ సినిమాకి హెల్ప్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన. పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు కానీ ఇదే నెగటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకి ఊహించని నష్టం కలిగే అవకాశం ఉంది. గుంటూరు కారం సినిమా విషయంలో జరిగింది ఇదే. మాస్ సినిమా అనుకోని మిడ్ నైట్ షోస్ చూడడానికి వెళ్లిన ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యి నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసారు. ఆ తర్వాత పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి వెళ్లడంతో గుంటూరు కారం టాక్… నెగటివ్ నుంచి డివైడ్ కి మారింది. సో ఈ పెయిడ్ ప్రీమియర్స్ వలన మంచి ఎంత జరుగుతుందో చేదు కూడా అంతే జరుగుతుంది. మరి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విషయంలో ఈ ప్రీమియర్స్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.
The tremendous response continues for the intense #AmbajipetaMarriageBand trailer ❤️🔥❤️🔥
Hits 4 MILLION+ VIEWS on YouTube 💥💥
– https://t.co/MtA2rpym88Grand release worldwide on Feb 2nd ❤️🔥
Bookings open soon 💥💥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk… pic.twitter.com/4TkpxVXTkn— GA2 Pictures (@GA2Official) January 28, 2024