టెలివిజన్ నుంచి సిల్వర్ స్కీన్ పైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘సుడిగాలి సుధీర్’. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ సింగింగ్, డాన్స్, మ్యాజిక్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బుల్లి తెర హీరో అనే పిలుపు నుంచి గాలోడు సినిమాతో బిగ్ స్క్రీన్ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు, ఇది గాలోడు సినిమా కంటే ముందే కమిట్ అయ్యాడు కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. గాలోడు సినిమాతో మాసివ్ హిట్ కొట్టాడు సుడిగాలి సుధీర్, కాలింగ్ సహస్ర్ర పెండింగ్ వర్క్స్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. సైలెంట్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన గాలోడు సినిమా సుధీర్ ని ఇండస్ట్రీలో చాలా మంది దృష్టిలో పడేలా చేసింది. దీంతో సుధీర్‌తో సినిమాలు చేసేందుకు చాలామంది డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సుధీర్ తో సినిమా చెయ్యడానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ రెడీ అవుతున్నాడట. ప్రభాస్‌ను పర్ఫెక్ట్‌గా చూపించి ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు డైరెక్టర్ దశరథ్. సంతోషం, మిస్టర్ పెర్ఫెక్ట్ట్ లాంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన దశరథ్, చివరగా మంచు మనోజ్‌తో ‘శౌర్య’ అనే సినిమా తీశాడు, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అక్కడి నుంచి దశరథ్ కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాగా గ్యాప్ తీసుకున్న దశరథ్, కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతూ సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గానే సుధీర్‌కి కథ కూడా వినిపించినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. మరి ప్రభాస్ దర్శకుడు, సుడిగాలి సుధీర్ తో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.