Sudigali Sudheer: గాలోడు.. గోట్ తో హిట్ కొట్టేలానే ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నేడు మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
అయ్యో పాపం సారూ..ఎట్టా బుక్కయ్యారు. లారీ గుద్దిన ఆటోలా దెబ్బయ్యి పోయారు. అయ్యో పాపం సారూ.. ఇట్టా లాక్ అయ్యారు.. 3D లో చూస్తున్నారు హర్రర్ పిక్చరూ అంటూ సాగిన లిరిక్స్ ఎంతో క్యాచీగా ఉన్నాయి. ఇక వీడియోలో ఆ వీధిలో రౌడీగా అందరిని భయపెట్టే కుర్రాడు.. ఒక అమ్మాయి వలలో పడి ఆమె చెప్పినట్లు చేస్తున్నట్లు చూపించారు. దివ్యభారతి షాపింగ్ బ్యాగ్ లు మోయడం.. ఆమె చున్నీని ఉతకడం లాంటివి చూపించగా .. పక్కన ఆంటీలు వీడికి తిక్క కుదిరింది అన్నట్లు చూడడం ఆకట్టుకుంటుంది. ఇక అలా ఆ అమ్మాయి ప్రేమలో పడిన సుధీర్ ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సురేష్ బనిశెట్టి అందించిన లిరిక్స్ కు లియోన్ జేమ్స్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఇక సీన్ రోల్డాన్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. మొదటిసాంగ్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఈ ఒక్క సాంగ్ తో గాలోడు తరువాత సుధీర్ మరో హిట్ ని అందుకునేలా ఉన్నాడు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!