లేడీ సూపర్ స్టార్ సమంత సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో హైదరాబాద్ లో హల్చల్ చేసిన సమంత, రిలీజ్ సమయానికి ఫారిన్ వెళ్లిపోయింది. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్లిన సమంత అక్కడి నుంచి ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తున్న సమంత షార్ట్ హెయిర్ స్టైల్ లో స్టైలిష్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ గా సమంత ముంబై వచ్చింది. ఒక ప్రోమో షూట్ కోసం ముంబై వచ్చిన సమంతాని పాపారాజ్జి చుట్టేసింది. స్లీవ్ లెస్ టాప్, డెనిమ్ జీన్స్, స్పెక్ట్స్ తో కనిపించిన సమంతని కామెరాన్ క్లిక్ చేసాయి. దీంతో సోషల్ మీడియాలోకి ఫోటోస్ వచ్చేసాయి. ఈ ఫోటోస్ లో సమంత లేడీ బాస్ లా, స్టైలిష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత కొత్త ఫోటోలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ట్యాగ్ ట్వీట్టర్ లో టాప్ ట్రెండ్ అవ్వడానికి ఇప్పుడు ఈ ఫోటోస్ కారణం అయ్యాయి.
Read Also: They Call Him OG: పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ సంభవం లోడింగ్…