Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. స్టైలిష్ డ్రెస్ లు వేసుకోవడం లేదు. మేకప్ లు కూడా ఉండట్లేదు. పూర్తిగా రగ్డ్ గా కనిపించేందుకే జై కొడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంత రగ్డ్ లుక్ లో కనిపించాడో చూశాం. ఆ లుక్ కు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది.
Read Also : LSG vs PBKS: హార్డ్ హిట్టర్ల సమరం.. పరుగుల వరద ఖాయం! తుది జట్లు ఇవే
అంతకు ముందు ప్రభాస్ సలార్ లో ఇలాగే కనిపించాడు. ఆ రగ్డ్ లుక్ కు మాస్ క్రేజ్ మామూలుగా రాలేదు. ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఆ మాస్ లుక్ లోనే బాగున్నాడంటూ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో తీస్తున్న సినిమాలో ఇలాగే కనిపిస్తున్నాడు. మొన్న దేవర సినిమాలో కూడా మాస్ లుక్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన పూర్తిగా గడ్డం, మీసాలతో దుమ్ములో ఉండే వ్యక్తిలాగా కనిపించబోతున్నాడంట. అటు రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమాలో ఎంత రగ్డ్ గా ఉన్నాడో మొన్న ఫస్ట్ లుక్ లోనే తెలిసిపోయింది. మహేశ్ బాబు కూడా రాజమౌళి సినిమాలో రగ్డ్ గానే కనిపించబోతున్నాడంట. నేచురల్ స్టార్ నాని ఇప్పటికే దసరా సినిమాతో ఇలాంటి లుక్ లో మెరిశాడు.
ఇప్పుడు దిప్యారడైజ్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో మెరుస్తున్నాడు. విజయ్ దేవరకొండ కూడా కింగ్ డమ్ సినిమా కోసం పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఇలా స్టార్ హీరోలంతా రొటీన్ లుక్ లను వదిలేసి.. సినిమా కోసం ఎలాంటి లుక్ లోకి అయినా మారేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ కోసమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆ లుక్ లో ఉంటేనే సినిమా కథకు న్యాయం చేసినట్టు అవుతుంది.