Tollywood: టాలీవుడ్ ను ఏలడానికి వచ్చిన విలన్స్ .. కాదు కాదు హీరోలు వీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి.. హీరోయిన్ తో రొమాన్స్ చేయాలి.. అనే భావన నుంచి హీరోలు బయటకు వచ్చారు. నటుడు అంటే.. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలగాలి అని చెప్పి సంపూర్ణ నటుడిగా మారుతున్నారు. అవును.. ఇప్పుడు హీరోలే విలన్స్.. విలన్సే హీరోలు. ఇక ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నా.. అందులో టాలీవుడ్ అభిమానుల ప్రేమ వేరు. ఏ భాష నటుడు వచ్చాడు అన్నది కాదు.. అతడి నటన ఎలా ఉంది.. ? మనకు నచ్చిందా.. ? అయితే గుండెల్లో పెట్టుకోవడమే.. ఇదే తెలుగు అభిమానులకు తెల్సిన ప్రేమ. అందుకే ఇతర భాషల నుంచి వచ్చిన హీరోలను, విలన్స్ ను సైతం ఆదరిస్తున్నారు. ఇక ఇతరా భాషలో స్టార్ హీరోస్.. తెలుగులో విలన్స్ గా తమ సత్తా చూపడానికి రెడీ అవుతున్నారు. హీరోలు అంటే మాములు హీరోలు కాదు..వారి ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోలు.. మన టాలీవుడ్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండించడానికి వచ్చేశారు. వారు ఎవరో చూద్దాం.
Tollywood: టాలీవుడ్ ను ఏలడానికి వచ్చిన విలన్స్ .. కాదు కాదు హీరోలు వీరే
Also Read
- Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. 'ఉప్పెన' క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
- Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
- PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో 'పెద్ది' దిగుతున్నాడు!
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
ఫహద్ ఫాజిల్
మలయాళంలో ఫహద్ కు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యాచురల్ యాక్టింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఫహద్ అనే చెప్పాలి. ఆయన తీసే సినిమాల్లో కథనే హీరో.. ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేయగలడు. ఈ మధ్యనే మామన్నన్ సినిమాలో క్రూరమైన కుల పిచ్చి ఉన్న రాజకీయ నేతగా కనిపించాడు. అయితేనేం.. సినిమా మొత్తానికి హైలైట్ అంటే అతనే అనేలా మార్చేశారు అభిమానులు. హీరోను పక్కన పెట్టి విలన్ ను హీరోగా మార్చేశారు. ఇక ఈ కుర్ర హీరోనే.. మన అల్లు అర్జున్ నటించిన పుష్ప లో విలన్. భన్వర్ సింగ్ షెకావత్ గా పుష్ప లో ఒక చిన్న శాంపిల్ చూపించిన ఫహద్.. పుష్ప 2 లో విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఫహద్ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 నుంచి రిలీజైన పోస్టర్ ను బట్టే అతని పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో సుకుమార్ చూపించేశాడు. నిజం చెప్పాలంటే బన్నీ కంటే ఎక్కువ భన్వర్ సింగ్ ఏ రేంజ్ లో నటిస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Zareen Khan: హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే?
పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్.. మలయాళంలో స్టార్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఒక్క ఏడాదిలోనే దాదాపు 20 సినిమాలు తీసిన ఏకైక హీరో అంటే అతనే అని చెప్పాలి. అంతేకాదు అన్ని సినిమాల్లో సగానికిపైగా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితుడే. ఒకప్పుడు పోలీస్ పోలీస్ అనే సినిమాతో తెలుగులో కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో విలన్ గా తెలుగువారికి కొత్త అవతారంలో పరిచయం కానున్నాడు. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి వరదరాజులుగా సిద్దమయ్యాడు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. ఆ ఒక్క పోస్టర్ తోనే అతడు ఎంత క్రూరుడో.. చూపించేశాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Love Guru: లవ్ గురు గా మారిన బిచ్చగాడు.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ
అర్జున్ సర్జా
హీరో నుంచి విలన్ గా మారిన నటుల్లో అర్జున్ సర్జా ఒకరు. కోలీవుడ్ నుంచి వచ్చిన హీరోనే అయినా తెలుగువారికి అర్జున్ చాలా సుపరిచితుడే. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అర్జున్.. తెలుగులో విలన్ గా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అవి ఆయనకు అంతగా పేరు తీసుకురాలేదు. ఇక ఇప్పుడు అర్జున్ .. లియో సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. హరాల్డ్ దాస్ అనే పాత్రలో తళపతి విజయ్ కు ధీటుగా నిలబడనున్నాడు. నిన్న అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లో రూత్ లెస్ విలన్ గా అర్జున్ కనిపించిన తీరు అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో సినిమాలో అర్జున్ – విజయ్ మధ్య ఫైట్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ అంచనాలను అర్జున్ అందుకుంటాడేమో చూడాలి.
Neha Shetty: స్టేజిపై చీరతో విశ్వక్ ను చుట్టేసి రొమాన్స్ చేసిన నేహా..
సైఫ్ ఆలీఖాన్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో సైఫ్ ఆలీఖాన్ ఒకడు. చాక్లెట్ బాయ్ నుంచి స్టార్ హీరోగా సైఫ్ ఎదిగిన విధానం అందరికి తెల్సిందే. బాలీవడో లో ఎన్నో హిట్ సినిమాలను అందించిన సైఫ్ .. ఆదిపురుష్ సినిమాతో విలన్ గా మారాడు. రావణ బ్రహ్మగా సైఫ్ కాస్ట్యూమ్స్ అయితే ప్రేక్షకులకు నచ్చలేదు కానీ, ఆయన నటన మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత సైఫ్ .. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమాలో సైఫ్ భైరా అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక నేడు సైఫ్ బర్త్ డే కావడంతో.. దేవర నుంచి భైరా లుక్ ను రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. దేవర కు ధీటుగా భైరా కనిపించాడు. సైలెంట్ గా కనిపిస్తున్న సైకోలా సైఫ్ లుక్ ఉండడంతో ఒక్కసారిగా దేవరపై హైప్ పెరిగిపోయింది. విలన్ గా ఆదిపురుష్ లో ఫెయిల్ అయినా దేవరతో ఈ బాలీవుడ్ హీరో విజయాన్ని అందుకునేలా ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి సైఫ్ విలనిజం ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇక వీరే కాదు.. సైంధవ్ సినిమాతో నవాజుద్దీన్ సిద్దిఖీ, భగవంత్ కేసరి తో అర్జున్ రామ్ పాల్.. ఇలా ఎంతోమంది హీరోలు టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ హీరోలు.. టాలీవుడ్ తమ విలనిజాన్ని చూపించి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!