కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోలీవుడ్ చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సూర్య చేస్తున్న 42వ సినిమాగా అతని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘కంగువ’ అనే టైటిల్‌ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఇప్పటికే కంగువ టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న కంగువా సినిమాని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం కంగువ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం సూర్య మేకోవర్ చూస్తే ఔరా అనాల్సిందే. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కండలు తిరిగిన దేహంతో.. యుద్ధానికి సిద్దమవుతున్న వీరుడిలా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు సూర్య. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే సూర్య, కంగువ కోసం వెయిట్ పెరిగి బల్కీ షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్య ఎక్స్సర్సైజ్ చేస్తున్న ఒక్క ఫోటో బయటకి రాగానే ఫాన్స్ దాన్ని వైరల్ చేస్తున్నారు, ఇందులో సిక్స్ ప్యాక్ ని సూర్య మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. తమ అభిమాన హీరోని బీస్ట్ మోడ్‌లో చూసి పండగ చేసుకుంటున్నారు సూర్య అభిమానులు. రోజు రోజుకి కంగువ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.