ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ విషయంలో ఏం జరిగిందో ఏమోగానీ… నెక్స్ట్ మాత్రం అలాంటి సీన్స్ రిపీట్ కాకుండా గట్టిగా కసరత్తులు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ తర్వాత సాలిడ్ ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సోషియో ఫాంటసీగా రానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే నెక్స్ట్ మెగా ఛాన్స్ ఎవరికి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే… ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణతో మెగా 156 లైన్లో ఉంది. అయినా కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చిరు ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి కానీ ఈ లోపే రేసులోకి బోయపాటి శ్రీను దూసుకొచ్చాడు.
స్కంద తర్వాత బోయపాటి చేయబోయేది మెగాస్టార్ సినిమానే అని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే… సుకుమార్ కూడా లైన్లోకి వచ్చాడు. అయితే ఈ కాంబినేషన్స్ తెరపై రావడం కొత్త కాదు… ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తునే ఉన్నాయి కాకపోతే మిగతా కమిట్మెంట్స్ కారణంగా సెట్ అవడం లేదు. ఇప్పుడు ఒక్క త్రివిక్రమ్ తప్ప… సుకుమార్, బోయపాటి నెక్స్ట్ సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే త్రివిక్రమ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయినా కూడా చిరుతో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక సుకుమార్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సుక్కు ప్రాజెక్ట్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. అలాగే స్కంద తర్వాత అఖండ2, స్కంద2 లైన్లో ఉన్నప్పటికీ.. ఇంకా అనౌన్స్ చేయలేదు బోయపాటి. దీంతో.. ఖచ్చితంగా ఈ ముగ్గురిలో ఒకరితో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా… ఈ క్రేజి కాంబినేషన్స్ సెట్ అయితే మామూలుగా ఉండదు.