టాలీవుడ్‌లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు సుమారు అరడజను మంది భామలదీ ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్‌గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతిహాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్ తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ మూడేళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇక అక్కడ నుండి తెలుగు ఆడియన్స్ కు దూరం జరుగుతూ.. తమిళ తంబీలతో రిలేషన్ పెంచుకుంటోంది.
Also Read : HHVM : హరిహర వీరమల్లు ‘కొల్లగొట్టినాదిరో’ ప్రోమో రిలీజ్
సలార్ వరకు టాలీవుడ్‌తో బాగానే ర్యాపో మెయిన్ టైన శృతి హాసన్ డెకాయిట్, చెన్నై స్టోరీల నుండి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేడమ్ కూడా ఫుల్ గా తమిళంపై ఫోకస్ చేస్తోంది. కూలీ, ట్రైన్ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. మహానటి కీర్తి సురేష్ భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత తెలుగులో కొత్త మూవీకి కమిటైన దాఖలాలు లేవు. కల్కిలో బుజ్జికి అరువు ఇచ్చిన కొంత ఫ్యాన్స్ ను శాటిస్పై చేయగలిగింది. ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అమ్మడు కూడా కొత్తగా తెలుగు సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. తమిళంలో రివాల్వర్ రాణి, కన్నివీడి చేస్తోంది. నిత్యామీనన్ భీమ్లా నాయక్ తర్వాత టీటౌన్ లో కనిపించలేదు. సమంత కూడా ఇంచుమించు టాలీవుడ్ కు దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ బర్త్ డేకు మా ఇంటి బంగారం ఎనౌన్స్ చేసింది కానీ ఆ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. అలాగే బీటౌన్‌లో సీటాడెల్ కంప్లీట్ కాగానే, రక్త బ్రహ్మాండ్ కు షిఫ్ట్ అయిపోయింది. ఇక రాశీ కన్నా, కాజల్ ఒకే ఒక్క తెలుగు సినిమా చేస్తుంది.