సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిట్ రిలీజ్ ఈవెంట్ కు కౌండౌన్ షురూ అయింది. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.SSMB 29కు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి.
అటు మహేశ్ ఫ్యాన్స్ కూడా వారణాసి టైటిల్ ఫిక్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మహేశ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు టాలీవుడ్ కు ఇచ్చాడు ఓ చిన్న దర్శకుడు. అది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన రఫ్ అనే సినిమాను డైరెక్ట్ చేసిన CH సుబ్బారెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ‘ వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడు ఈ దర్శకుడు. SSMB 29 సినిమాకు వారణాసి టైటిల్ ఫిక్స్ చేసారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ టైటిల్ ను మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నామని తెలియజేస్తూ అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి ఇప్పుడు రాజమౌళి, మహేశ్ బాబు సినిమాను అదే టైటిల్ ను ప్రకటిస్తారా లేదా మరేదైనా టైటిల్ ను అనౌన్స్ చేస్తారా లెట్స్ వెయిట్ అండ్ వాచ్