సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిట్ రిలీజ్ ఈవెంట్ కు కౌండౌన్ షురూ అయింది. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో LED స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తున్నారట.
Also Read : Hot Beautys : ఈ ఇద్దరు టాల్ అండ్ హాట్ ప్లాప్స్ భామలు హిట్ కొట్టేదెప్పుడు..
ఈ ఈవెంట్ కు ఘట్టమనేని అభిమానులు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వీడియో కంటెంట్ కూడా ఏదో రెడీ చేస్తున్నారని టాక్. కాగా ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ ఈవెంట్ తమ ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా డీల్ సెట్ చేసింది హాట్ స్టార్. ఈ SSMB 29కు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాడు జక్కన్న. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కు మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 15న శనివారం సాయంత్రం 6 గంటల నుండి GlobeTrotter ఈవెంట్ మొదలు కానుంది. కేవలం టైటిల్ రిలీజ్ కే ఈ స్థాయిలో ఈవెంట్ చేస్తున్నారంటే ట్రైలర్ రిలిజ్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.