RRR : మూవీపై విదేశీ మీడియా రాతలు… రాజమౌళి ఊహించని రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR Success Celebrations బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన RRR Success Celebrationsలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి మూవీపై విదేశీ మీడియా రాతలు, అక్కడి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు.
Read Also : Hari Hara Veera Mallu : సెట్లో పవన్.. కొత్త లుక్ వైరల్
Also Read
విదేశీ మీడియా నుండి RRR ప్రశంసలు పొందడం గురించి రాజమౌళి స్పందిస్తూ యునైటెడ్ స్టేట్స్ సినిమాను ప్రశంసిస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు. రాజమౌళి మాట్లాడుతూ “బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. కానీ తేడా ఏంటంటే విదేశీ మీడియా మాత్రం RRR గురించి రాస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కూడా మా సినిమా గురించి రాసింది. ముఖ్యంగా యూఎస్‌లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇది నాకు హార్ట్ టచింగ్ మ్యాటర్. బాహుబలి 2కి జపాన్ నుంచి ప్రశంసలు వస్తాయని, ఆర్‌ఆర్‌ఆర్‌కి యూఎస్ నుంచి ఆదరణ వస్తుందని ఊహించలేదు. బాక్సాఫీస్ నంబర్‌లు ముఖ్యమనే విషయాన్ని కాదనలేము. కానీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు చాలా ముఖ్యమైనవవి” అని ఆయన అన్నారు. “మనం చేయగలిగేది ప్రాజెక్ట్‌కి 100 శాతం ఇవ్వడం, చేయగలిగినంత ఉత్తమంగా చేయడం అని నేను ఎప్పుడూ చెప్తాను. అంకెలు మన చేతుల్లో లేవు, ప్రేక్షకులపై ఆధారపడి ఉంటాయి. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలను మాత్రమే మనం అంచనా వేయగలము” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!