NTV Telugu Site icon

SS Karthikeya: గేమ్ చేంజర్ సినిమాపై రాజమౌళి కోడుకు ట్వీట్…

Ss Karthikeya

Ss Karthikeya

దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ లా ఉండే కార్తికేయ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా చరణ్ ని విష్ చేస్తూ ట్వీట్ చేశాడు.

Read Also: Nabha Natesh: దుంపా తెంచేసావే… దుమారం ఎదో రేపావే…

Wishing a very happy birthday to my brother from another mother! You will always have a special place in my heart @alwaysramcharan I wish that #GameChanger will be yet another game-changing film for you” అంటూ కార్తికేయ ట్వీట్ చేశాడు. చరణ్ తో పాటు తను కూడా ఉన్న ఫోటోని ట్వీట్ చేసిన కార్తికేయ, మెగా అభిమానులకి ఒక అన్-సీన్ ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందులో చరణ్, కార్తికేయ భుజంపై చెయ్ వేసి చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపించాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ లోని ఎపిసోడ్ షూట్ చేసే సమయంలో ఈ ఫోటోని క్లిక్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది.  

Show comments