ఈ ఏడాది చిరు, బాలయ్యలతో నటించి రెండు హిట్స్ కొట్టింది శృతి హాసన్. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న శృతి హాసన్, ముంబై బేస్డ్ విజువల్ ఆర్టిస్ట్ ‘శాంతను’తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్ గానే తమ ప్రేమ విషయాన్ని ఉంచిన శృతి హాసన్, ఇటివలే ఫాన్స్ తో ఇంటరాక్షన్ కోసం ఇన్స్టాలో ‘ఆస్క్ మీ’ సెషన్ ని పెట్టింది. ఇందులో ఒక అభిమాని శాంతనుతో పాటు ఉన్న ఫోటోని పోస్ట్ చెయ్యమని అడిగడంతో శృతి హాసన్, శాంతనుతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఇంకో ఫ్యాన్ శాంతనుకి తమిళ్ నేర్పించిన్చొచ్చు కదా అని శృతి హాసన్ ని అడిగాడు. శాంతను చిన్న చిన్న తమిళ పదాలు మాట్లాడతాడని చెప్పిన శృతి హాసన్, శాంతను తనని ‘అలగు'(తెలుగులో అందం అని అర్ధం) అని పిలుస్తాడాని చెప్పింది.
ఇలా హ్యాపీ జరుగుతున్న Q&Aలో ఒక ఫాన్ శృతి హాసన్ ని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ ప్రశ్న చూడగానే ఆన్సర్ ని టైప్ చెయ్యకుండా వీడియోని పోస్ట్ చేసింది శృతి హాసన్. ఆ వీడియోలో శృతి హాసన్ నవ్వుతూ… పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ఫ్యాన్ కి ‘లేదు, ఎందుకంటే’ అని చెప్పి, కెమెరాను పక్కకి తిప్పింది. వీడియోలో శృతి హాసన్ పక్కన తన ప్రియుడు శాంతాను హజారికా ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇయర్ ఇప్పటికే రెండు హిట్స్ కొట్టిన శృతి హాసన్, సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ కాబోతుంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వరకూ శృతి హాసన్ కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో క్రాక్, వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, సలార్ సినిమాలు చేసి శృతి హాసన్ ఎవరూ ఊహించని రేంజులో బౌన్స్ బ్యాక్ అయ్యింది.