Sreeleela : హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా ఓ పాపను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది. మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చేశారు అంటూ రాసుకొచ్చింది. ఇంకేముంది ఆ ఫొటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలీల మూడో పాపను దత్తత తీసుకుంది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున శ్రీలీల పోస్టు మీద మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చేశాయి. దీంతో అసలు ఆ పాప ఎవరా అని చాలా మంది సోషల్ మీడియాలో ఆరా తీశారు. ఇంత రచ్చ జరుగుతుండటంతో చివరకు శ్రీలీల స్పందించింది. ఆ పాప ఎవరో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆమెను పొగిడిన వారంతా నిట్టూరుస్తున్నారు.
Read Also : Pooja Hegde : పూజాహెగ్డే దుకాణం బంద్ అవుతుందా..?
ఆ ఫొటోలో ఉన్నది తన సోదరి కూతురు అని శ్రీలీల స్పష్టం చేసింది. ‘నా సోదరి కూతురి వల్ల ఈ పిన్నిలో మరింత జోష్ నిండిపోయింది’ అంటూ రాసుకొచ్చింది. దెబ్బకు అంతా షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు నువ్వేదో మూడో పాపను దత్తత తీసుకున్నావేమో అంటూ అనుకున్నాం.. కానీ అసలు సంగతి ఇదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల ఇప్పటికే ఇద్దరు దివ్యాంగులైన గురు, శోభిత అనే పిల్లలను దత్తత తీసుకుంది. ఈ పాప ఫొటో షేర్ చేయడంతో మూడో పాపను దత్తత తీసుకుందేమో అని అంతా అనుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి నిట్టూరుస్తున్నారు.
Read Also : Sailesh Kolanu: సిడ్నీ వెళ్తున్నా.. ఆరునెలలు అక్కడే!