Lorry Chapter-1: First Look Unveiled : కొన్నాళ్ల క్రితం కరాటే కళ్యాణి వివాదంతో ఫేమస్ అయిన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు అతనే హీరోగా నటిస్తూ కథ, స్టాంట్స్, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “లారి చాప్టర్ -1” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసి హైదరాబాద్ వచ్చి పలు చిత్రాల్లో వివిధ శాఖలలో పని చేసి ప్రావీణ్యం పొంది అనంతరం యూట్యూబ్ లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించి ఇప్పుడు “లారి చాప్టర్ -1” అనే సినిమాటతో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా చంద్ర శిఖ నటించగా రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.
Film Chamber : తెలంగాణలో థియేటర్స్ మూసివేతపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ “చెన్నై లొయోల కాలేజీ లో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్ లో నా కెరీర్ ప్రారంభించా, యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేశా, చాలా వ్యూస్ వచ్చాయి, పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశా, ఇప్పుడు “లారి చాప్టర్ -1” అనే సినిమా తో మీ ముందుకు వస్తున్నా అన్నారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా అని అన్నారు. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలో విడుదల చేస్తా, నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుందని అన్నాడు. ఈ సినిమాకి తాడిపత్రి నాగార్జున కెమెరా మాన్ కాగా ఆసం వెంకట లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు.