2025లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రలో కోర్ట్ ఒకటి. శ్రీదేవి–రోషన్ నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించిన ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా వెన్నెల–చందుల కెమిస్ట్రీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని తప్పులేదు ప్రేమలో సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, ఆల్బమ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. కాగా ఈ హిట్ పేర్ మరోసారి.. జత కట్టబోతుంది.
Also Read : Kajol Twinkle Khanna: కాజోల్, ట్వింకిల్ ఖన్నా కొత్త టాక్ షో ‘టూ మచ్’ ట్రైలర్ లాంచ్
స్టేట్ vs ఎ నోబడీ మూవీలో యూత్‌ఫుల్ జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీదేవి–రోషన్ మరోసారి కలిసి రానున్నారు. తొలి సినిమాతోనే తమ నటనతో మెప్పించిన ఈ జంట ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ఇప్పుడు శ్రీదేవి–రోషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీదేవి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, కొత్త ప్రాజెక్ట్ గ్లింప్స్‌ను పంచుకుంది. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. బ్యాండ్ మేళం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సెప్టెంబర్ 17 ఉదయం 9:45 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. “మీ సపోర్ట్ కావాలి” అంటూ శ్రీదేవి చేసిన ఈ పోస్టుకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ, కోర్ట్ తరహా మ్యాజిక్ మళ్లీ చూడాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన గామా అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ జంట కలిసి సందడి చేసి ఆకర్షణీయంగా నిలిచారు.