Sridevi: శ్రీదేవి చివరి ఫోటో.. కన్నీళ్లు ఆగడం లేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sridevi: అందానికి పేరు అంటూ ఉంటే దానిపేరు కచ్చితంగా శ్రీదేవి అని ఉండేదేమో. బహుశా దేవలోకం నుంచి తప్పించుకొని భూమి మీద పడ్డ దేవకన్యనా అని అనిపించకమానదు ఆమెను చూస్తే.. అందుకే సినీలోకం ఆమెకోసమే రాసారేమో.. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అని.. కానీ ఆ అతిలోక సుందరి అందరిని విడిచి స్వర్గానికి వెళ్లి ఐదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ ఆమె లేదు అంటే జీర్ణించుకోవడం కష్టమే అని చెప్పాలి. నేడు శ్రీదేవి ఐదవ వర్ధంతి. ఇదే రోజు ఆమె దుబాయ్ లో ఒక పెళ్ళికి వెళ్లి.. అక్కడ హోటల్ లోని బాత్ రూమ్ లో గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఒక్కసారిగా ఆమె మృతితో సినిమా ఇండస్ట్రీ చీకటిగా మారిపోయింది. ఎన్ని వేల సినిమాలు.. ఎన్ని భాషలు.. ఎంతమంది హీరోలు.. ఆమెలేని లోటు ఇప్పటికే కాదు ఎప్పటికి ఎవరు తీర్చలేరు. ఇక నేడు ఆమె వర్ధంతి కావడంతో అభిమానులు మరోసారి శ్రీదేవిని తలుచుకుంటున్నారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీదేవి.. 16 ఏళ్లకే హీరోయిన్ గా మారడం.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Trivikram: పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?
Also Read
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ఎన్నో రికార్డులు శ్రీదేవి పేరు మీద ఉన్నాయి. శ్రీదేవి చిన్నతనం నుంచి చనిపోయేవరకు కూడా ఆమె సినిమా రంగంలోనే ఉంది. ఇక శ్రీదేవి చివరి కోరిక.. కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడడం. అది చూడకుండానే ఆమె మృతి చెందింది. ఇక తన తల్లిని ఇద్దరు కూతుళ్లు మర్చిపోలేక పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జాన్వీ నిత్యం తన తల్లికి సంబంధించిన ఏదొక విషయాన్నీ నెమరువేసుకొంటూనే ఉంటుంది. ఇక శ్రీదేవి భర్త బోనీకపూర్.. ఆమె లేదు అని జీర్ణించుకోవడానికి ఆయనకు చాలానే టైమ్ పట్టింది. ఇక తాజాగా బోనీ శ్రీదేవి చివరి ఫోటోను షేర్ చేశాడు. దుబాయ్ లో బంధువుల పెళ్ళిలో అతిలోక సుందరి ఎంతో ఆనందంగా గడిపింది. ఆ నవ్వు.. మరికొద్దిసేపటిలో ఉండదు అని తెలియని కుటుంబం.. అంతో జోకులు వేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..