Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో శ్రీముఖినే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్లు ఎప్పుడో దాటేసింది ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తన పెళ్లి గురించి బ్రేకప్ గురించి ఒక క్లారిటీ ఇచ్చింది.
Akkineni Naga Chaitanya: ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నా మనసును కదిలించింది
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో శ్రీముఖి ముచ్చటించింది. అందులో భాగంగా ఒక ఫాలోవర్ “శ్రీముఖి గారు మీరు ఎప్పుడైనా ప్రేమలో విఫలమయ్యారా..?” అని అడగగా దానికి శ్రీముఖి నిర్మొహమాటంగా ” ఓ బొచ్చెడు సార్లు” అంటూ చెప్పకు వచ్చేసింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత మీరు యాంకరింగ్ మానేస్తారా అన్న ప్రశ్నకు పెళ్లి తర్వాత కూడా నేను ఈ యాంకరింగ్ మానను.. కచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటానని మాటిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీముఖి ఒక బిజినెస్ మేన్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. మరి అతనితోనే ఆమె పెళ్లి ఉండబోతుందా..? లేక పెద్దలు కుదిరిచిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.