Site icon NTV Telugu

Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..!

Sreeleela

Sreeleela

Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. కానీ పుష్ప-2లో చేసిన మాస్ ఐటెం సాంగ్ తో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దాంతో మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఒకసారి అనుభవం వచ్చాక ఆచితూచి అడుగులు వేయాలి.

Read Also : Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?

శ్రీలీల అంటే డ్యాన్స్, గ్లామర్ తప్ప నటన అనే ముద్ర పడట్లేదు. హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలి అంటే బలమైన పాత్రల్లో నటించాలి. అప్పుడే బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆమె నటన పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ శ్రీలీల ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఒక్కటి కూడా బలమైన పాత్ర లేదు. గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి సరసన జూనియర్ మూవీలో చేస్తోంది. అదేమంత గొప్ప పాత్ర కాదు. అటు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఓ మూవీ చేస్తోంది. అది కూడా బలమైన పాత్ర కాదు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయట్లేదు శ్రీలీల. ఎంతసేపు గ్లామర్, డ్యాన్స్ అంటే కుదరదు కదా. రష్మిక, సాయిపల్లవి, కీర్తి సురేష్, అనుష్క శెట్టి, తమన్నా లాంటి వారు లాంగ్ టైమ్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారంటే కారణం.. వారు నటించిన బలమైన పాత్రలే. ఆ విషయం శ్రీలీల కూడా అర్థం చేసుకుంటేనే బెటర్. లేదంటే గ్లామర్ పాత్రలతో ఎక్కువ కాలం నెట్టుకురాలేదు.

Read Also : OG : ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

Exit mobile version