పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్న హను రాఘవపూడి తో ప్రభాస్ త్వరలోనే సినిమా చేయబోతున్నాడు..
ఈ కాంబోలో వస్తున్న సినిమా పై ఇప్పటికే అనౌన్స్ మెంట్స్ కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కాబోతోంది. ప్రీ ప్రొడెక్షన్ పనులు ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హను రాఘవపూడి ఓ ప్రేమకథ రెడీ చేశారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..
ఈ సినిమాలో డార్లింగ్ కు జోడిగా యంగ్ హీరోయిన్ శ్రీలీలా ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. హను రాఘవపూడి కొద్ది రోజుల క్రితమే శ్రీ లీలను స్వయంగా కలిసి కథ మరియు ఆమె పాత్ర గురించి వివరించారట. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, దాదాపు ఒకే అయ్యినట్లు తెలుస్తుంది.. ఇక ప్రస్తుతం శ్రీలీలా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈమెతో సినిమా చెయ్యాలని దర్శక నిర్మాతలు వరుసగా క్యూ కడుతున్నారు.. ఇప్పుడు శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది. ప్రభాస్ సినిమా చర్చల దశలో ఉంది. డార్లింగ్ తో సినిమా అంటే ఇక అమ్మడు లైఫ్ ఫుల్ ఫామ్ లో పడినట్లే..