Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో శ్రీ లీల మాట్లాడుతూ.. ధమాకా సినిమా తర్వాత ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజకు నాకు మంచి సూపర్ హిట్ కాంబినేషన్. అది ఈ మూవీతో కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. రవితేజ గారు చాలా సీనియర్ అయినప్పటికీ అందరితో జోవియల్ గా ఉంటారు. ఆయన పర్సనల్ గా ఎంత ప్రెషర్ లో ఉన్నా సరే.. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా సరే సెట్స్ లో అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. అదే ఆయనలో ఉన్న గొప్ప విషయం.
Read Also : Mass Jathara : రజినీ తర్వాత రవితేజనే.. బ్లాక్ బస్టర్ పక్కా : సూర్య
అది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. సెట్లో అందరిని ఎంకరేజ్ చేయడంలో రవితేజ గారు ఎప్పుడు ముందుంటారు. డైరెక్టర్ భాను గారు నాకు రవితేజకు కొన్ని మాస్ సీన్లు రాశారు. ఆ సీన్లలో రవితేజ గారిని నేను తిట్టాలి. కానీ నేను అలా చేయను అని చెప్పాను. దానికి రవితేజ గారు ఒప్పుకోలేదు. లేదమ్మా నువ్వు నన్ను తిట్టట్లేదు క్యారెక్టర్ ను తిడుతున్నావు.. కాబట్టి తిట్టు పర్లేదు అంటూ ఎంకరేజ్ చేశారు రవితేజ. అలా ఆయన సపోర్ట్ వల్లే సినిమాను కంప్లీట్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల. భాను డైరెక్షన్ చాలా బాగుంది అని.. రాజేంద్రప్రసాద్ గారితో తన సీన్స్ అదిరిపోతాయి అంటూ తెలిపింది.
Read Also : Mass Jathara : ఇది పెద్ద హిట్ అవుతుంది రాసిపెట్టుకోండి.. రవితేజ స్టేట్ మెంట్
