రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి ఫ్రెండ్స్ అయిన రష్మిక-విజయ్ మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ విజయ్-రష్మిక కలిసి నటించనున్నారు అనే న్యూస్ వినిపిస్తోంది. గౌతమ్ తిన్నునూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక స్పై థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతుంది.
Read Also: Payal Rajput: నవంబర్ 17న మంగళవారం వస్తుంది…
#VD12 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీలో ముందుగా శ్రీలీల హీరోయిన్ అనుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల అవుట్ అయ్యిందని సమాచారం. లేటెస్ట్ గా #VD12 గురించి వస్తున్న రోమర్స్ ప్రకారం శ్రీలీల ప్లేస్ లో రష్మిక వచ్చి చేరిందట. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. అనిమల్ మూవీ రిలీజ్ అయితే రష్మిక క్రేజ్ మరింత పెరిగడం గ్యారెంటీ. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ కి ఉన్న క్రేజ్, రష్మికకి ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్… #VD12కి పక్కా హెల్ప్ అవనున్నాయి. మరి రష్మిక విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.