Spy Trailer: యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత తన మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా గా స్పై ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఈడీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో నింపేశారు.
Pet Dogs: డాగ్స్ ను పెంచుకుంటున్నారా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది జాగ్రత్త
“చరిత్ర మనకెప్పుడు నిజం చెప్పదు .. దాస్తోంది. దానికి సమాధానం మనమే వెతకాలి ” అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. చనిపోయాడు అనుకున్న ఖాదిర్ అనే టెర్రరిస్ట్ బతికే ఉన్నాడని ఇండియన్ గవర్నమెంట్ కు తెలియడంతో అతడిని చంపడానికి స్పై ఏజెన్సీలను అలెర్ట్ చేస్తారు. అయితే ఆ ఖాదిర్ ఇంకోపక్క నేతాజీ ఫైల్స్ దొంగతనం చేసినట్లు హీరో జై ఏజెన్సీ కి తెలుస్తోంది. ఇక అక్కడ నుంచి జై.. ఖాదిర్ తో పాటు నేతాజీ చనిపోయాడా లేదా..? అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ ఆపరేషన్ లోనే అన్న సుభాష్ చనిపోతే.. అతని చావుకు కూడా కారణం వెతుకుతూ ఉంటాడు. అసలు ఖాదిర్ కు నేతాజీ ఫైల్స్ తో ఏం సంబంధం ఉంది.. ? ఆ ఫైల్స్ తో దేశం పరువు ఎలా ముడిపడి ఉంది. చివరికి నేతాజీ చనిపోయాడా..? లేదా..? అనేది సినిమాచూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ చివరిలో రానా మరో స్పై గా కనిపించి షాక్ ఇచ్చాడు. అయితే మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది అని ఒకరు అనగా .. “స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు లాక్కొనేది .. ఇది నేను చెప్పింది కాదు నేతాజీ చెప్పింది” అని రానా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా మారింది. ఇక సినిమాకు మరో హైలైట్ అంటే విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల సంగీతం అని చెప్పొచ్చు. నిఖిల్ స్పై గా అదరగొట్టాడు. ఐశ్వర్య అందాల ఆరబోతకే కాకుండా ఆమె కూడా స్టంట్స్ చేస్తూ మంచి పాత్రలోనే కనిపిస్తుందని తెలుస్తోంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. జూన్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.