‘పుష్ప’రాజ్ ని ఢీ కొట్టబోతున్న హాలీవుడ్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు.
Read Also : రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్’ ‘పుష్ప’రాజ్ తో క్లాష్ కు సై అంటున్నాడు. “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” కొత్త ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్ లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. ట్రైలర్‌లో మార్వెల్ శాండ్‌మ్యాన్, డాక్టర్ ఆక్టోపస్, ఎలక్ట్రో, గ్రీన్ గోబ్లిన్, లిజార్డ్, హాబ్ గోబ్లిన్‌లు కన్పించడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ట్రైలర్ చివరలో ‘స్పైడర్ మ్యాన్’ ఈ ఆరుగురు విలన్‌లతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.
అదే రోజున ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా మూవీగా భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘పుష్ప’. ఏదైతేనేం ‘పుష్ప’రాజ్ గట్టి పోటీనే ఎదుర్కోబోతున్నాడు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..