రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్

రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్‌”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు.

జెర్సీ చూశాక కొత్త దశ స్టార్ట్ అయ్యింది అన్పించింది. ఈ టీజర్ చూశాక మీ యాక్టింగ్ లో ఇంకో కోణం చూడబోతున్నామనే ఇంపాక్ట్ అన్పించింది. మీరేమంటారు ?
నాని : ప్రతి సినిమా ద్వారా ఏదో విషయాన్ని లేదా కొత్త దశను స్టార్ట్ చేయడానికి చేస్తాం. కొన్ని కుదురుతాయి. కొన్ని కుదరవు. ప్రయత్నంలో లోపం ఉండదు.క్రిస్మస్ చాలా ప్రత్యేకం.

Read Also : టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !

ఈ ఎపిక్ లవ్ స్టోరీలో ‘రాయాలన్నా, కాల రాయాలన్నా…’ అని మొదటి సారి ప్రెస్ చేసి చెప్పినట్టుంది. ‘శ్యామ్ సింగ రాయ్’లో ప్రెస్ ప్రతినిధిగా మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
నాని : మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఈ డైలాగ్ కు. మీడియాకు ఉన్న పవర్ అది ‘రాయాలన్నా, కాల రాయాలన్నా’… మీరంతా ఇది నా బయోపిక్ అనుకుంటున్నారేమో. అది ఆ బయోపిక్ కాదు. సినిమాలో నా పాత్రకు సంబంధించి రైటర్ ఎలిమెంట్ అనేది ఉంది. ట్రైలర్ లో మరికొన్ని డీటెయిల్స్ ఇస్తాము.

Related Articles

Latest Articles