‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంతేకాదు 2019 సంవత్సరంలో విడుదలైన “అవెంజర్స్ : ఎండ్‌గేమ్” తర్వాత ఇన్ని టిక్కెట్లు అమ్ముడయిన మొదటి మార్వెల్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” మూవీ బుకింగ్స్ పరంగా డిస్నీ “బ్లాక్ విడో” ప్రీ-సేల్స్‌ను 2 గంటలలోపు అధిగమించింది.
Read Also : కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి శ్రీను!
ఈ చిత్రంలోని స్టార్ కాస్ట్ విషయానికొస్తే… టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా, జెండాయ హీరోయిన్ గా, బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ డాక్టర్ స్ట్రేంజ్‌గా, జాకబ్ బటాలోన్ లీడ్స్‌గా, మారిసా టోమీ స్పైడర్ మ్యాన్ ఆంటీగా కనిపించనున్నారు. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. “స్పైడర్ మ్యాన్”కి విదేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విపరీతమైన క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా భారతదేశంలో ఒక రోజు ముందుగానే విడుదల కానుంది. డిసెంబర్ 16న ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.