బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సోనూసూద్ ను ఇప్పటి వరకూ విలన్ గానే చూశాము. అయితే తాజాగా ఈ విలన్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. జీ స్టూడియోస్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్‌లో సోనూ సూద్ హీరోగా కనిపించనున్నారు. తాజాగా జీ స్టూడియోస్ తన తదుపరి ప్రొడక్షన్ ‘ఫతే’ను ప్రకటించింది. దీనికి అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోనూ సూద్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ సినిమాలో సోనూసూద్ ను మునుపెన్నడూ చూడని అవతార్ లో చూడబోతున్నాము. ఈ మూవీలో ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాయి. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Read Also :
ఇక సోనూసూద్ గత సంవత్సరం నుండి అవసరమైన వారికి చేయూత ఇవ్వడం, క్లిష్ట పరిస్థితులలో వారికి సహాయం చేయడం వంటి కారణాలతో చాలామంది ప్రజలకు రియల్ హీరోగా మారాడు. సోను చివరగా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ ‘సింబా’లో కనిపించాడు. రియల్ లైఫ్ లో హీరోగా పేరు తెచ్చుకున్న ఈ రీల్ విలన్ ఇప్పుడు రీల్ హీరోగా మారుతున్నాడు. మరి ఆయన హీరోయిజంను ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.