Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా అమ్మేశాడు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముంబైలోని లోఖండ్ వాలా మినర్వా ఏరియాలో సోనూకు ఓ లగ్జరీ ఫ్లాట్ ఉంది.
Read Also : Ritika Nayak : శ్రీలీల, మీనాక్షిని టెన్షన్ పెడుతున్న కొత్త హీరోయిన్..
2012లో ఈ ఏరియాలో మహాలక్ష్మీ అపార్టుమెంట్ ను రూ.5.16 కోట్లకు కొన్నాడు సోనూసూద్. తాజాగా దీన్ని రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. అంటే రూ.2.94 కోట్ల లాభానికి అమ్మేశాడన్నమాట. సడెన్ గా దీన్ని ఎందుకు అమ్మేశాడన్నది తెలియదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూసూద్ తాను సంపాదించిన సొమ్మును రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాడు. ముంబైలోని ఖరీదైన ఏరియాల్లో ఆయనకు ఫ్లాట్లు, స్థలాలు ఉన్న సంగతి తెలిసిందే.
Read Also : Pawan Kalyan : మొన్న విజయ్.. నేడు బాలయ్య.. పవన్ కు పోటీనే లేదా..?
