Sonali Bendre: ఎన్టీఆర్ సినిమాతో మహేష్ హీరోయిన్ రీ ఎంట్రీ.. నిజం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మురారి చిత్రంతో తెలుగు తెరకు బంగారు కళ్ల బుజ్జమ్మ గా మారిపోయింది సోనాలి బింద్రే. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోలందరి సరసాన్న నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. ఇక మధ్యలో ఆమె క్యాన్సర్ బారిన పడడం విచారకరం.. ఎంతో కష్టపడి ఆ మహమ్మారి వ్యాధితో పోరాడి బయటికి వచ్చి నిజమైన యోధురాలిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోనాలి బాలీవుడ్ లో పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సోనాలి.. ఎన్టీఆర్ 30 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం, అది కాస్తా వైరల్ గా మారడం తెలిసిందే.. ఇక తాజాగా సోనాలి నటిస్తుంది అన్న వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం అడగగా ఆమె ఆశ్చర్యపోయారు. ” ఏంటీ నేనా..? మీరు అంటున్నది నిజమేనా..? నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు.. పొరపాటున వేరేవారిని అనబోయి నన్ను అనుకున్నారేమో ఒక్కసారి చూడండి.. నా దగ్గరకు అయితే ఎవరు రాలేదు.. నన్ను సంప్రదించలేదు. ఇవన్ని తప్పుడు వార్తలు” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ చిత్రంలో సోనాలి ఉంది అన్న మాటలు పుకార్లే అని తేలిపోయింది. ఏదిఏమైనా ఆమె ఉంది ఉంటే బావుండు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడైనా కొరటాల ఈ విషయం గురించి ఆలోచించి సోనాలిని తీసుకోవచ్చు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
- NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
- Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. 'ఖడ్గం' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
- spirit : స్పిరిట్ పోస్ట్‌పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్‌మంతర్‌లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్