2023 సంవత్సరంలో 12 నెలల యందు.. మే నెల వేరాయా.. అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితులు. అసలు ఈ నెలలో ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, మహేష్.. ఈ నలుగురి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ల హవానే నడుస్తోంది. వీళ్ల అభిమానుల దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా సోషల్ మీడియాను పోటాపోటీగా కబ్జా చేస్తున్నారు. ముందుగా ప్రభాస్ నుంచి ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆదిపురుష్ ట్రైలర్ సోషల్ మీడియాలో వ్యూస్ తో దుమ్ములేపుతుండగానే… సోషల్ మీడియాను టేకొవర్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి కాసేపట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతుదడంతో ట్విట్టర్ లో పవన్ ఫాన్స్ రచ్చరంబోలా చేస్తున్నారు. వీళ్ల జోష్ ని మరింత పెంచుతూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ సాలిడ్ గా బయటకి వచ్చి, నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. దాదపు 24 గంటల పాటు పవన్ ఫాన్స్ ట్విట్టర్ ని కబ్జా చేస్తారు, వీళ్ల సందడి తగ్గేలోపే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సింహాద్రి రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఒక రీరిలీజ్ సినిమాకి ముందెన్నడూ చూడని, ఒక కొత్త సినిమా రిలీజ్ సమయంలో కూడా ఎవరూ చెయ్యని రేంజులో ఆన్ లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ నుంచి బ్యాటన్ ని అందుకోని సోషల్ మీడియాని హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు ఘట్టమనేని అభిమానులు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 నుంచి టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టైటిల్ కోసం మహేశ్ ఫాన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతగా వాళ్లని వెయిట్ చేయిస్తున్న టైటిల్ రివీల్ అయితే మహేశ్ ఫాన్స్ సైలెంట్ గా ఉండడం కష్టమే. ఇలా మొత్తంగా మే నెల అంతా ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకి సోషల్ మీడియా షేక్ అవుతోంది.