Sobhita : టాలీవుడ్ యంగ్ కపుల్స్ నాగచైతన్య, శోభిత గురించి ఈ నడుమ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోది. సమంతతో విడిపోయాక నాగచైతన్య ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేశారు. చివరకు శోభితతో సెట్ అయిపోయాడు. అయితే వీరిద్దరూ పెళ్లికి ముందు నుంచే డేటింగ్ లో ఉన్నారని తెలిసిందే. కాకపోతే ఆ లవ్ స్టోరీ ఎలా మొదలైందో, ఎప్పుడు మొదలైందో తెలియదు. తాజాగా ఆ డీటేయిల్స్ మొత్తం చెప్పేసింది శోభిత. చైతన్య, శోభిత పెళ్లి తర్వాత మొదటిసారి ప్రముఖ మ్యాగజైన్ వోగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తమ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైందో చెప్పేసింది శోభిత.
read also : Manoj : ‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి’.. మోహన్ బాబుపై మనోజ్ ట్వీట్
‘ఒకసారి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నాగచైతన్య నిన్ను ఫాలో అవుతున్నాడు. నువ్వు ఎందుకు ఫాలో అవట్లేదు అని అడిగాడు. నేను చైతన్య ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే నాతో పాటు 70 మందిని ఫాలో అవుతున్నాడు. నేను కూడా ఫాలో చేశాను. ఆ తర్వాత మా ఇద్దరి నడుమ మెసేజ్ లు నడిచాయి. అలా చాటింగ్ లోనే మేం ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. 2022లో మొదటిసారి చైతన్య నా కోసం ముంబైకి వచ్చాడు. అక్కడ ఇద్దరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాం. అప్పటి నుంచే మా డేటింగ్ మొదలైంది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లను చైతన్య కలిశాడు. నేను కూడా నాగార్జున గారిని కలిశాను. ఇంట్లో వాళ్లు కూడా ఓకే చేసిన తర్వాతనే మేం పెళ్లి చేసుకున్నాం’ అంటూ శోభిత చెప్పుకొచ్చింది.