Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు ఏ రేంజ్ కు వెళ్లాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు మీదనే మనోజ్ కేసులు పెట్టారు. మనోజ్ మీద వారిద్దరు కూడా కేసులు పెట్టారు. ఒకరికి ఒకరు మాటల్లేకుండా పోయాయి. చిన్న సాకు దొరికినా సరే మనోజ్ తన తండ్రి, అన్న మీద విరుచుకుపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నేడు మోహన్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మనోజ్ తన తండ్రి ఫొటోలను షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. ఇందుకోసం ఓ సాంగ్ ను కూడా యాడ్ చేశారు.
read also : Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ట్వీట్ వైరల్
నా సూర్యుడివి, నా చంద్రుడివి నువ్వే అనే సాంగ్ ను ఈ ఫొటోలకు జత చేశారు. ఆయన చేసిన ట్వీట్ లో మోహన్ బాబు నటన గురించి, సినిమాల గురించి తెలియజేసే చిన్న వీడియో క్లిప్ ను కూడా పోస్టు చేశారు. ఇందులో.. ‘హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన సెల్రబేట్ చేసుకోవడాన్ని మిస్ అవుతున్నా.. నీ వెంట నడిచేందుకు వెయిట్ చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ కు తండ్రి మీద ఇంత ప్రేమ ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత ప్రేమ దాచుకుని ఈ గొడవలు అన్నీ ఎందుకు అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.