Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1 కూడా సినిమా అనౌన్స్ చేసినప్పుడే రెండో భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. ఇక ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. స్కంద కనీసం కొంత డీసెంట్ కలెక్షన్స్ రాబట్టగలిగినప్పటికీ, పెద్ద కాపు 1 బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ గురించి అధికారిక ప్రకటనలు ముందే వచ్చాయి కానీ రెండు సినిమాల బ్యాడ్ రిజల్ట్స్ తో సీక్వెల్ ప్లాన్స్ క్యాన్సిల్ అయినట్లు చెబుతున్నారు.
Aadikeshava: శ్రీ లీలను ‘హే బుజ్జి బంగారం’ అంటున్న వైష్ణవ్ తేజ్
బోయపాటి శ్రీను ఇతర ప్రాజెక్ట్‌ల మీద ఫోకస్ పెడుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల కూడా దాదాపు అదే చేస్తున్నాడని అంటున్నారు. స్కంద క్లైమాక్స్‌లో స్కంద 2లో రామ్ పోతినేని రెండో పాత్ర గురించి ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ‘పెద్ద కాపు 2’లో కూడా పెద్దకాపుగా విరాట్ కర్ణ డి ఎదుగుదల గురించి శ్రీకాంత్ అడ్డాల మంత్రి అయ్యేలా చూపిస్తారని అంతా అనుకున్నారు. అయితే, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలను ఎదుర్కొన్న క్రమంలో స్కంద – పెద్ద కాపు వాటి సీక్వెల్‌లు వచ్చే అవకాశం లేదు. ఈ సినిమాల కథలలో కూడా సీక్వెల్ కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలా చేసే అనేక ఆసక్తికరమైన అంశాలు లేవు కాబట్టి డ్రాప్ అవ్వడమే బెటర్ అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.