Panja Vaisshnav Tej’s Aadikeshava Melody “Hey Bujji Bangaram” Song Released: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా ‘ఆదికేశవ’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ- యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు. చేసిన తక్కువ సినిమాలతోనే వైవిధ్యమైన జానర్లతో తనదైన ముద్ర వేసిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో పాటు సినిమాలో శ్రీలీల కూడా కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ‘మ్యాడ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సితార సంస్థ దీపావళికి ఆదికేశవతో ఆ విజయపరంపరను కొనసాగించాలని చూస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Nayanthara: ఎల్లీ మ్యాగజిన్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార అదిరిపోయిందిగా….
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘సిత్తరాల సిత్రావతి’ అనే పాట విడుదలై సంగీతం, సాహిత్యంతో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఆ పాటలోని శ్రీలీల, పంజా వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్‌లు కూడా వైరల్‌గా మారి ప్రేక్షకుల మెప్పు పొందగా వాటిని కంటిన్యూ చేస్తూ ఆదికేశవ టీమ్ “హే బుజ్జి బంగారం” అనే మెలోడీ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట హీరో ప్రేమను తెలిపేలా ఉండగా జి.వి.ప్రకాష్ సంగీతం ఈ రొమాంటిక్ పాటకి ఓ కొత్త అనుభూతిని జోడించినట్టు అనిపించింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఎంతో అందంగా ఆలపించారని చెప్పాలి. ఇక ఈ సినిమాతో జోజు జార్జ్, అపర్ణా దాస్ తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ ఆదికేశవ సినిమా నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.