SK : నేచురల్ స్టార్ నాని బాటలో కోలీవుడ్ స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నానిలా కోలీవుడ్‌లో జోవియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శివకార్తీకేయన్. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న టైంలోనే అక్కడ కూడా శివకార్తీకేయన్ యాక్షన్ హీరోగా మేకోవర్ అవతున్నాడు. రీసెంట్లీ అమరన్‌తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిన ఈ స్టార్ హీరో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఫ్యామిలీ ఓరియెంట్, యూత్ ఎంటరైనర్ల కన్నా యాక్షన్ చిత్రాలకే మొగ్గు చూపుతున్నాడు. ఎస్కే 25 గా తెరకెక్కుతోన్న పరాశక్తి పొలిటికల్ డ్రామాగా వింటేజ్ స్టోరీగా తెరకెక్కుతోంది. అలాగే ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో మదరాసి రూపుదిద్దుకుంటోంది.
Also Read : Kollywood : తన పేరు నుండి తండ్రి పేరు తీసేసిన యంగ్ హీరో
Also Read
మదరాసి ఫక్తు యాక్షన్ త్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది.ఇక ఇవే కాకుండా మరికొన్ని సినిమాలకు శివకార్తీకేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 2018తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జుడే ఆంటోనీ జోసెఫ్ మూవీకి కమిటయ్యాడని సమాచారం. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే గోట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో మూవీకి కమిటయ్యాడు శివకార్తీకేయన్. ఇది కూడా యాక్షన్ జోనర్ మూవీగానే ఉండబోతుంది. ఇవే కాకుండా గుడ్ నైట్ ఫేం వినాయక్ చంద్రశేఖరన్ సినిమాకు శివ ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాలన్నీ ఎక్కువగా మాస్ ఆడియన్స్ దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయోగాల్లానే కనిపిస్తున్నాయి. అమరన్ హిట్టుతో ఇమేజ్ పెరగడంతో కలెక్షన్లు రావాలంటే మాస్ ఇమేజ్ ఉండాలని భావిస్తున్నాడు శివ కార్తీకేయన్. రీసెంట్లీ నాని కూడా హిట్ 3, ప్యారడైజ్‌తో ఊరమాస్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ ఫ్యామిలీ స్టార్ హీరో కూడా ఇదే దారిలో వెళ్లిపోతున్నాడు.
తాజావార్తలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!