సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే తనలోని మల్టీ టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా చూపించిన సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమనే విషయం అభిమానులకు తెలిసిందే.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సితార తన తాజా డ్యాన్స్ సెషన్‌లలోని ఒక వీడియోను పంచుకుంది. సితారకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ అనీ మాస్టర్ శిక్షణ ఇవ్వడం ఈ వీడియోలో కన్పిస్తోంది.
Read Also : నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన
సితార, అనీ మాస్టర్ కలిసి డీజే స్నేక్ చార్ట్ బస్టర్ ‘టకీ టకీ’ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. “అనీ మామ్ స్టెప్పులను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా రాలేదు..ధన్యవాదాలు అనీ మాస్టర్” అని సితార పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు నమ్రత ‘లవ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)
A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)