Site icon NTV Telugu

Sita Ramam Trailer: సీత కోసం వెతుకుతున్న రష్మిక.. ఇంతకీ రామ్ ఎవరు?

Sitaramam

Sitaramam

Sita Ramam Trailer: మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే ‘సీతారామం’. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ వంటి సినిమాలను తెరకెక్కించిన హనురాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించింది. మద్రాస్ రెజిమెంటల్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేసే రామ్‌ రాసిన లేఖ ఆధారంగా సీత కోసం రష్మిక వెతుకుతున్న సన్నివేశాలు ట్రైలర్‌లో చూపించారు. సీత కోసం రామ్… రామ్ కోసం సీత పరితపించే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Read Also: OTT Release: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ కొత్త రూల్!

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ నేపథ్యాలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఈ ట్రైలర్‌లో చూపించారు. బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ పాత్రలో సుమంత్ నటించాడు. మురళీశర్మ, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ మూవీని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version