Single : శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. కార్తీక్ రాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంటోంది. థియేటర్లలో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మే9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఆరు రోజుల్లోనే రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వీకెండ్ లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also : Rabin Hood : ఓటీటీలో రాబిన్ హుడ్ హవా.. 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్
ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా మరింతగా కలెక్షన్లు సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పుడు వస్తున్నదంతా లాభాలే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా వచ్చిన సింగిల్ మూవీ.. ప్రస్తుతం థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కామెడీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు మూవీ యూనిట్ చెబుతోంది.
Read Also : Software Job: లక్షల్లో వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..