Robin Hood : యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్కడ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంస్థలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ZEE5లో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సంపాదించింది ఈ మూవీ. ఈ మూవీ ఇంతటి ఘనత అందుకోవడంపై మూవీ టీమ్ తో పాటు ఓటీటీ స్పెషల్ అనౌన్స్ చేశారు.
Read Also : Software Job: లక్షల్లో వసూలు చేసి, బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..
యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటూ ఓటీటీ సంస్థ జీ5 సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన స్పెషల్ ట్వీట్ వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబిన్ హుడ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోందని సంస్థ తెలిపింది. ఈ మూవీ ఇదే స్పీడుతో కొనసాగుతోందని వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిపెట్టడం అనే కాన్సెప్టుతో మొదలై.. ఆ తర్వాత డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జీ5లో ఇంకా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : Kingdom : కింగ్ డమ్ ను లాక్ చేసిన యూనిట్.. సెట్స్ నుంచి ఫొటో..