Actor Ranveer Singh Sells His 2 Apartments In Goregaon Mumbai: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో తన రెండు అపార్ట్‌మెంట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రెండు అపార్ట్‌మెంట్లను మొత్తం రూ.15.25 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. రణ్‌వీర్ సింగ్ డిసెంబర్ 2014లో ఈ రెండు అపార్ట్‌మెంట్లను ఒక్కొక్క దాన్ని రూ. 4.64 కోట్లకు కొనుగోలు చేశారు. గోరెగావ్ ఈస్ట్‌లోని విలాసవంతమైన ఒబెరాయ్ ఎస్క్వైట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రతి అపార్ట్‌మెంట్‌కి 1,324 చదరపు అడుగుల విస్తీర్ణం, ఒక్కొక్కదానికి మొత్తం ఆరు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఒక్కో యూనిట్‌కు స్టాంప్ డ్యూటీ రూ. 45.75 లక్షలని తెలుస్తోంది. అంటే దాదాపుగా ఈ అపార్ట్‌మెంట్లను అమ్మడం వలన ఆరు కోట్ల వరకు రణ్ వీర్ లాభపడ్డాడు అన్నమాట.
Game Changer : ‘జరగండి’ పాట వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..
ఇక మరోపక్క రణ్‌వీర్ సింగ్ తన-భార్య దీపికా పదుకొనే ఇటీవల బాంద్రా బ్యాండ్ స్టాండ్‌లోని సాగర్ రేషమ్ బిల్డింగ్‌లో రూ. 100 కోట్లకు పైగా విలువైన మూడు నుంచి నాలుగు అంతస్తులతో సముద్రానికి ఎదురుగా ఉన్న పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఇక రణవీర్ సింగ్ సినిమాల గురించి చెప్పాలంటే ఆయన ప్రస్తుతం రోహిత్ శెట్టితో ఒక సినిమా చేస్తున్నారు. ‘సింగం ఎగైన్’లో సింబాగా నటిస్తున్నాడని అంటున్నారు. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, టైగర్ ష్రాఫ్ – దీపికా పదుకొనే కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఇక చివరిగా ఆయన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కథ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో అలియా భట్ రణ్వీర్ సింగ్ సరసన నటించింది.